ఘనంగా శ్రీమతి వినుత కోటా జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా జన్మదిన సందర్భంగా గురువారం పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున సంబరాలు జరిపి 14 చోట్ల కేక్ కటింగ్, అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా రామసేతు వంతెన వద్ద భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని గోశాల నందు గోవులకు దానా అందించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం ఏరియా ఆసుపత్రి నందు రోగులకు బ్రేడ్, జ్యూస్, పండ్లు పంపిణీ చెయ్యడం జరిగింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం, బిక్షాల గాలి గోపురం వద్ద అన్నదానం చేశారు. శ్రీకాళహస్తి పట్టణం పెళ్లి మండపం వద్ద కేక్ కట్టింగ్, అన్నదానం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం, బస్టాండ్ సెంటర్ వద్ద కేక్ కట్టింగ్, అన్నదానం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం, ఇందిరా కాలనీ నందు కేక్ కట్టింగ్, అన్నదానం నిర్వహించారు. తొట్టంబేడు మండలం, చిలకావారి కండ్రిగ నందు కేక్ కట్టింగ్ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం, బంగారమ్మ కాలనీ నందు కేక్ కట్టింగ్ నిర్వహించారు. తొట్టంబేడు పంచాయతీ లోని అమ్మ ఆశ్రమం నందు వృద్దులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. ఏర్పేడు టౌన్ నందు కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించారు. ఏర్పేడు మండలం, వికృత మాల ఆశ్రమం నందు కేక్ కటింగ్ చేసి, స్నాక్స్ అందించారు. రేణిగుంట మండలం అక్షయ క్షేత్రం అందు బియ్యం, నిత్యావసర వస్తువులు వితరణ చేశారు. రేణిగుంట పట్టణం బస్టాండ్ సెంటర్ వద్ద భారీ కేక్ కట్ చెయ్యడం జరిగింది. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు వినుతని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పైన కార్యక్రమాల్లో ఆ ఆ మండలాల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.