రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన బొబ్బేపల్లి సురేష్

  • రైతు భరోసా యాత్ర 7వ విడత పోస్టర్లను ఆవిష్కరించిన బొబ్బేపల్లి సురేష్
  • రైతుల కన్నీరు తుడిచేది జనసేనాని మాత్రమే

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ప్రతి కుటుంబానికి రూ.లక్ష రూపాయలు చొప్పున ఇప్పటికే ఆరు విడతలు ఆరు జిల్లాల్లో 650 కుటుంబాలకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం అందజేశారు. ఏడవ విడత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో 300 కుటుంబాలకి చెక్కులు అందజేయనున్నారు. ఈ విషయంపై నేడు పోస్టర్ ని విడుదల చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో 46 మంది కౌలు రైతులు చనిపోయారని, అలాంటి ముఖ్యమంత్రి గారు ఆయన సొంత జిల్లాలోనే 46 మంది కౌలు రైతులను కాపాడలేకపోయారని, మరి రాష్ట్రంలో 70 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, కౌలు రైతులను ఏ విధంగా ఆదుకొని కాపాడాలనే ఆలోచన చేయకుండా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతుంటే ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో మూడు తుఫానులు వచ్చి రైతులు వేసుకున్న పంటలను నట్టేట ముంచి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. కానీ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టం కింద ఆర్థిక సాయం చేయలేదు. కనీసం నష్టపోయిన రైతుల వివరాలు వెల్లడించడం కానీ, ఆ రైతు కుటుంబాలకి ఎకరాకు రూ.పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి మాట ఇవ్వడం గానీ చేయలేదు. అలాంటి పరిస్థితులు కూడా లేవు. మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు. రైతులకు న్యాయం చేయలేనప్పుడు మరి ఆ శాఖకు మంత్రి ఎందుకు, చేయలేని వారికి మంత్రి పదవి ఇవ్వడం వృధానే కాదా. రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ఇచ్చి వీళ్ళని అధికారంలో కూర్చోబెడితే కనీసం రైతులను ఆదుకునే స్థితిలో కూడా లేని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రైతే వెన్నుముక అయితే అలాంటి రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి అంత మంచిది కాదు. కానీ అధికార పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతసేపు రైతులకు, రైతు కుటుంబాలకు న్యాయం చేస్తున్నారని కళ్ళు బుల్లి మాటలు చెబుతున్నారే తప్ప, నిస్వార్ధంగా ఎవరూ కూడా ఇప్పటివరకు రైతులకు న్యాయం చేయలేదు. రైతులకు అండగా ఉంటాం, రైతులను ఆదుకుంటాం, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి పూర్తిస్థాయిలో సకాలంలో డబ్బులు అందిస్తాం అనేటటువంటి విషయాన్ని వెల్లడి చేసిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో నిజమైన రైతుబిడ్డ ఎవరయ్యా అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, రైతు కన్నీరు తుడిచేది ఎవరయ్యా అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, రైతులకు అండగా నిలబడిన పార్టీ ఏది అంటే ఒక జనసేన పార్టీ మాత్రమే, ఇకనైనా రైతులు కళ్ళు తెరిచి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే రైతులు వ్యవసాయం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖనే పూర్తిగా నిర్విర్యం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం. కాబట్టి దయచేసి రైతాంగం అంతా కూడా ఒక్క క్షణం ఆలోచించాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ రహీం, బల్లేం భాను, చంద్ర, నరసింహులు, జానీ సింగ్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.