సరిపల్లిలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

పోలవరం నియోజకవర్గం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొయ్యలగూడెం మండలం, సరిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు తోట రవి, గ్రామ అధ్యక్షులు ఒరింకల సత్తిబాబు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పాల్గొన్న మహిళలందరికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. రైతులు అందరు కష్టపడి పండించిన పంట ఇంటికి తీసుకు వచ్చి కుటుంబంతో కలిసి చేసుకునేది సంక్రాంతి అని, జూదం జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని, రంగువల్లులు, క్రీడా పోటీలు నిర్వహించాలనే గొప్ప ఉద్దేశంతో సంక్రాంతిని అందరం సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో, కొయ్యలగూడెం మండల సేవ ప్రతినిధి అరేటి ఏసుబాబు, సర్పంచ్ తాడేపల్లి గోపి, అంకేం మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.