వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు”

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో జనసేన అధినేత పన కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం “నా సేన కోసం నా వంతు” గురువారం జిల్లా ప్రధాన కేంద్రం పాడేరులో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాడేరు, అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య మరియు మండలస్థాయి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి పర్యటిస్తూ “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం యొక్క ప్రాధాన్యత జనసేనపార్టీ యొక్క ఆలోచనావిధానం ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీతో ఒక్క రోజులో సుమారు 250 మంది ప్రజలను భాగస్వామ్యం చేయడం జరిగింది. ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. అలాగే ఈ కార్యక్రమం గడువు పెంచితే బాగుంటుందని ప్రజల్లో చైతన్యం ఇంకా రావాల్సిఉందదని భౌగోళికంగా మారుమూల గ్రామాల్లో సెల్యూలర్ సిగ్నల్స్ లేని పల్లెల్లో నుంచి కూడా అభిమానులు, జనసైనికులు, ప్రజలు ఉన్నందున ఈ విషయమై పార్టీ పునరాలోచన చేస్తే బాగుంటుందని పలువురు పేర్కొన్నారు. పాడేరు పట్టణ వర్తకసంఘంతో కూడా కలిసి నా సేనకోసం నా వంతు కార్యక్రమానికి మంచి స్పందన ఉందని డా.గంగులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి నాయకులు పాడేరు మండల అధ్యక్షులు, నందోలి మురళి కృష్ణ, ఉపాధ్యక్షులు భూపాల్, ఎక్సిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హాసన్, మధు, వెంకట్, బాచి, సంతోష్, కిల్లో అశోక్, సత్యనారాయణ మజ్జి, మధు, అశోక్ సాలేబు, లక్ష్మయ్య, గణేష్, శేఖర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పాడేరు ప్రజలందరికీ, వర్తకసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని డా.వంపురు గంగులయ్య తెలిపారు.