నాగబాబు పర్యటన మొదటి రోజు విజయవంతం

  • జగన్ కు మరో అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులను బ్యాంకులలో తాకట్టు పెడతాడు
  • జనసేన పార్టీ క్రియాశీలక ప్రతి ఒక్క సభ్యుడు పదిమంది చేత ఓటు వేయించాలి
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా నాగబాబు సమావేశం మొదటిరోజు విజయవంతంగా ముగిసింది

చిత్తూరు: రెండో విడత సమావేశంలో జీడీ నెల్లూరు, మదనపల్లి, చంద్రగిరి, సత్యవేడు, నగిరి ఈ ఐదు నియోజకవర్గాల నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, జాతీయ అధికార ప్రతినిధి అజయ్ కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ , మరియు ముఖ్య నాయకులతో కలిసి పార్టీ బలోపేత దిశగా రాబోవు రోజులలో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన ఎలా ముందుకు వెళ్లాలి, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి అని నాగబాబు కార్యకర్తలకు దిశా నిర్దేశించారు. జనసేన పార్టీ క్రియాశీలక ప్రతి ఒక్క సభ్యుడు పదిమంది చేత ఓటు వేయించాలి. సామ, దాన విధానాలన్నీ ఉపయోగించి ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యుడు పది మందికి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేస్తున్న, చేసిన మంచి కార్యక్రమాలను వివరించి, జనసేన పార్టీకి ఓటు వేయించాలని జనశ్రేణులందరికీ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర త్వరలోనే మొదలు కాబోతుందని, ప్రతి ఒక్కరు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని శ్రద్ధగా విని ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని తెలియజేశారు. అదేవిధంగా టిడిపి నేతలు నాగబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ, ముఖ్య నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.