నరసాపురం జనసేన ఆత్మీయ సమావేశం

  • నరసాపురం మండల కమిటీ ప్రకటన

నరసాపురం మండల జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం మరియు మండల కమిటీ నియామకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాల మీద సందేశం ఇచ్చారు. అనంతరం నరసాపురం మండల కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, జక్కం బాబ్జి, వలవల నాని, గంటా కృష్ణ, ఆకుల వెంకటస్వామి, ఒడుగు ఏసు, కోపల్లి శ్రీను, తోట నాని, పెమ్మాడి కిరణ్, వట్టిప్రోలు సతీష్, సముద్రాల సత్యవాణి మరియు నరసాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.