మెగాస్టార్ కు సీపిఐ నారాయణ క్షమాపణ చెప్పాలి: రాష్ట్ర చిరంజీవి యువత

*కబర్థార్ నారాయణ గారు

తాడిపత్రి: అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సీపిఐ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాయణ డాక్టర్ పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ.. తాడిపత్రి నియోజక వర్గం రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్, సీనియర్ అభిమాన నాయకుడు మేదర మురళీ, ఉపాధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి ల అద్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందరభంగా నాయకులు మాట్లాడుతూ సినిమా ప్రపంచానికి ఒక ధృవతార లాంటి వ్యక్తి, సినిమా రంగం లోనూ, రాష్ట్ర సామాజిక అంశాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. రక్త దాన కేంద్రాలు, నేత్ర దాన కేంద్రాలు, మొన్న కరోనా కలంలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి ఎన్నో ప్రాణాలను కాపాడిన ప్రాణదాత చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిని మీరు మాట్లాడిన మాటలు సరైనవి కావు, మీ వయస్సుకు గౌరవం ఇచ్చి మేము తెలియజేసేది ఒక్కటే మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నారాయణ గారి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అల్తాఫ్, షేక్ సాదక్ వలి, గోపాల్, శివ కుమార్ రెడ్డి, అమీర్, సాయి, పవన్ కళ్యాణ్, గాయిబు వలి మొదలైన వారు పాల్గొన్నారు.