నారి శక్తి వందన్ ఆమోదం శుభపరిణామం: కర్న కిరణ్ తేజ

చీరాల: నారి శక్తి వందన్ బిల్లు లోక్ సభ మరియు రాజ్యసభలో ఆమోదం పొందడం శుభపరిణామం అని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగ అధ్యక్షులు కర్న కిరణ్ తేజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారి శక్తి వందన్ బిల్లు ఆమోదం పొందడం ద్వారా చట్టసభలలో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లభించే గొప్ప అవకాశం లభిస్తున్నది. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర రాజకీయ వ్యవస్థలో ఇది ఒక గొప్ప పరిణామం. మహిళలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో రాజకీయంగా మహిళలు స్వతంత్రంగా ఎదుగుతూ భారత దేశంలో సామాజిక సమతుల్యత, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి బలంగా భావిస్తున్నామని చెపుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగం తరఫున భారత దేశంలో ఉన్న మహిళా మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.