రాజానగరం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా “జాతీయ రైతు దినోత్సవం”

రాజానగరం, భారతదేశ ఐదవ ప్రధాని “చౌదరి చరణ్ సింగ్” వారు వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, చేపట్టిన పలు సంస్కరణలకు గౌరవ సూచికంగా జరుపుకునే “జాతీయ రైతు దినోత్సవం” రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పక్షాన, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ “జాతీయ రైతు దినోత్సవం” అత్యంత అట్టహాసంగా కన్నుల పండుగలా జరిగింది.

కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో బత్తుల బలరామకృష్ణ ఎడ్లబండిపై ఎక్కి స్వయంగా తోలుతూ జనసేన జెండాలతో అలంకరించిన గారడీతో ఊరేగింపుతో, జనసేన జెండాలు అమర్చిన పలు ఎడ్లబళ్లను జనసేన నాయకులు, వీరమహిళలు ఎడ్లబళ్ళు తోలుతూ బాణసంచా పేల్చుతూ సభా ప్రాంగణానికి చేరుకున్న వందలాది రైతులు, వేలాది జనసేన శ్రేణులు, నాయకులు నడుమ బత్తుల దంపతులు సభాప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం సభా వేదికపై వీరమహిళలు, రైతుసంఘం నాయకులు, రైతులచే “జ్యోతి ప్రజ్వలన” అనంతరం పలు సంస్కృతి కార్యక్రమాలైన కూచిపూడి నాట్యం, భరతనాట్యం, జానపద నృత్యాలు, జానపద గేయాలతో రైతులను గౌరవించే విధంగా, దేశానికి అన్నం పెట్టిన వారిచేసిన సేవలను స్మరించుకుంటూ, కార్యక్రమం ముందుకు సాగింది.

అనంతరం పలువురు రైతు సంఘం నాయకులు, జనసేన నాయకులు ప్రసంగించిన మీదట బత్తుల బలరామకృష్ణ ప్రసంగిస్తూ… దేశానికి అన్నం పెడుతున్న రైతన్న దేశానికి వెన్నుముక లాంటివాడని, రైతు లేనిదే దేశం లేదని, ఈరోజు రైతాంగం పూర్తిగా దిక్కు దిక్కుతోచని స్థితిలో గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు దొరక్క, ఎరువులు, పురుగుమందులు రేట్లు భారీగా పెరిగి, అవి కూడా కల్తీ విత్తనాలు దొరకడం వల్ల దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న రైతుకు, పకృతి వైపరీత్యాలు సంభవించి రైతు అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం రైతాంగానికి ఏమాత్రం సహకరించడం లేదని, ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారి, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రైతు కుటుంబాలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ అప్పులపాలు అయిపోయాయని, రైతులను అప్పులు ఊబిలో కోరుకుని పోయేలా చేసింది ఈ ప్రభుత్వమనీ, ఈ ప్రభుత్వం వచ్చాక ఏ రైతు సుభిక్షంగా లేడని, రాష్ట్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, అనునిత్యం రైతాంగం గురించి కొత్త విధానాలు తీసుకొస్తూ, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్న జనసేన పార్టీని ఆదరించి, నీతి నిజాయితీపరుడు, రైతు బాంధవుడైన పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి. ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం నియోజకవర్గ నలుమూలల ఉన్న రైతులకు చిరు సత్కారం అనగా నూతన వస్త్రములు అందించి, మెమోంటోని బహుకరించి వారిని సత్కరించడం జరిగింది. వచ్చిన వారందరికీ భోజన ఏర్పాటు చేయడం జరిగింది.

ట్రాక్టర్లు, వరికోసే యంత్రాలు, వ్యవసాయానికి సంబంధించిన పలు పరికరాలు, పలు యంత్రాలు, ఎడ్ల బళ్ళు, వ్యవసాయ ఆధారిత పరికరాలు, పురుగుల మందులు, ఎరువులు, నర్సరీ మొక్కలు, స్టాల్స్ గా ఏర్పాటు చేసి భారీ ఎగ్జిబిషన్ గా హైలైట్ చేసిన విధానం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది..

ఈ “జాతీయ రైతు దినోత్సవం” ఇంతటి ఘనవిజయం చేసిన ప్రతిఒక్కరికీ బత్తుల బలరామకృష్ణ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుండి వేలాదిగా రైతులు, వందలాది జనసేన నాయకులు, నియోజకవర్గ నలుమూలల నుండి బైక్లు, కార్లలో వచ్చి జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండుగలా భారీ స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది.