నిఖత్ జరీన్ యువతకు స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయ మహిళా బాక్సర్, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్స్ లో ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తూ రింగ్ లో దూకుడుగా ఆడిన విధానం ప్రశంసనీయం. నిఖత్ జరీన్ క్రీడా ప్రస్థానం, విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.