అదిరిందయ్యా జగన్ రెడ్డి.. ప్రజా సమస్యలు గాలికి – డైవర్ట్ రాజకీయాలు జనాల్లోకి: గుడ్లూరు జనసేన

గుడ్లూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు మేరకు గుడ్లూరు మండల జనసేన ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రజాసమస్యలు పట్ల అవగాహన తెచ్చుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే మాండౌస్ తుఫాన్ కారణంగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రము నుంచి 2 కి.మీ దూరం లో ఉన్న ఎం.ఎస్.ఆర్ కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకోవడమైనది. అవసరం మేరకు విద్యుత్ స్తంభాలు లేకపోవడం, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకే ఇళ్ళు మడుగులు అవుతున్నాయని ఈ పర్యటనలో స్ధానికులు వాపోయారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో సరైన విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో పురుగు పుట్రా వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే, రెక్కాడితే గానీ డొక్క ఆడని పరిస్థితి. ఈ స్థితిలో పిల్లలు చదువుకోవడానికి 3 కి.మీ నడిచి రావలసిన పరిస్థితి, బస్ సౌకర్యం లేదు. ఇలాంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కూడా తీర్చలేని ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంకా కొనసాగాలా లేదా ఇంటికీ సాగనంపాలా అని ప్రజలు నిర్ణయించుకోవాలి. సమస్యలు ఇబ్బడిముబ్బడిగా ఉంటే ముఖ్యమంత్రి గారేమో వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు ఎందుకు రావూ అంటున్నారు. అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతారు, సమస్యలు పరిష్కారం కోసం కానరారు అని జనసైనికులతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిజాయితీపరుడు, మంచి మనసు ఉన్న పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలు గుర్తెరిగేలా చైతన్య పోరాటం చేయాలని గుడ్లూరు మండల జనసేన నిర్ణయించింది.