“బర్ల”తో “బత్తుల” ఆత్మీయ భేటీ

  • శ్రీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గార్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. రాజానగరం నియోజకవర్గంలో జనసేన, టిడిపి శ్రేణులు ఐకమత్యంగా పనిచేద్దాం
  • జనసేన, టిడిపి పార్టీల పొత్తుపై.. వైసిపి ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా.. రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఇరు పార్టీల సత్తా చూపిద్దాం
  • కలిసి పని చేద్దాం.. రాజానగరం నియోజకవర్గాన్ని వైసీపీ అరాచక, అవినీతి పాలన నుండి రక్షించి.. ఇరు పార్టీల ఆధ్వర్యంలో సుపరిపాలంతో ప్రజా పరిపాలన చేసి చూపిద్దాం

రాజానగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బర్ల బాబురావుని వారి స్వగృహం నందు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ గౌరవపూర్వకంగా కలిసి, వారికి పుష్పగుచ్చం ఇచ్చి, దుస్సాలువతో చిరు సత్కారం అందజేసి, పలు విషయాలపై ఆత్మీయ పూర్వకంగా చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించిన సందర్భంగా.. వారి యొక్క సేవలు, సలహాలు, సహాయ సహకారాలు జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీకి ఉండాలని, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలనీ.. రానున్న ఎన్నికలలో విజయం సాధించడానికి సహాయ సహకారాలు అందించాలని బర్ల బాబురావుని మర్యాదపూర్వకంగా కోరడం జరిగింది. అనంతరం బర్ల బాబురావు సానుకూలంగా స్పందిస్తూ.. అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలియజేస్తూ.. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా, సమిష్టిగా కృషి చేద్దామని తెలియజేసారు. తెదేపా, జనసేన పార్టీల ఉమ్మడి ధ్యేయం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే అని తెలియజేసారు. రాష్ట్రాభివద్ధి రెండు పార్టీలతోనే సాధ్యమన్నారు. శ్రీ చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నిర్ణయాన్ని గౌరవిస్తూ.. జనసేన, టిడిపి ఉమ్మడి కార్యాచరణతో రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి, అవినీతి వైస్సార్సీపీ పార్టీనీ గద్దె దింపుదామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.