ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు డా. గంగులయ్య మద్దతు

పాడేరు: కాంట్రక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిసెంబర్ 20వ తేదీనుంచి నిరవధిక సమ్మెచేస్తున్నారు. విద్యాశాఖపరిధిలో సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగుల రెగ్యులర్, సమాన పనికి సమానవేతనం, ఉద్యోగ భద్రత ఇతర సమస్యల పరిస్కారం కోసం హెచ్, ఆర్.ఎ., ఈ.పీ.ఎఫ్, ఈ.ఎస్.ఐ అమలు చేయాలని 8 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు జనసేన పార్టీ పాడేరు పార్లమెంట్ ఇన్చార్జ్ గంగులయ్య మద్దతు తెలిపారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యాశాఖకీ చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ విషయంలో కూడా మాట తప్పింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆర్థిక నేరస్తుడు కనుకనే నేటికి రాస్ట్రాన్ని కూడా ఆర్ధిక సంక్షోభంలో నెట్టేశారు. ఇలా అన్ని రకాల ఉద్యోగుల్ని మోసం చేశారు. ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. సుమారు 8 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా కనీస ఆలోచన చేయకపోవడం సోచాయనియమన్నారు. కచ్చితంగా ఇదే ఉద్యోగులు మిమ్మల్ని ఇంటికి సాగనంనాంపేందుకు సిద్ధమవుతారని కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న ఈ సమ్మెకు జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రంలో పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, బూత్ కన్వినర్ సుర్ల సుమన్, జనసేనపార్టీ ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్, మత్స్యరాజు, బాబీ తదితర జనసైనికులు పాల్గొన్నారు.