ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు జనసేన మద్దతు

అనంతపురం: కాంట్రక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల ముందు అసెంబ్లీలోను, పాదయాత్రలోనూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ పారిశుద్ధ కార్మికులందరికీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి నేటి వరకూ పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. పర్మినెంట్ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారానికే సిపిఎస్ అమలు చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి నేటి వరకూ నెరవేర్చకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ సిబ్బంది నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ తరుపున పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని అనంతపురం జనసేన పార్టీ తరఫున వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ తక్షణమే అమలు చేయాలి. క్లాప్ డ్రైవర్లకు బకాయి ఉన్న 6 నెలల వేతనం తక్షణమే చెల్లించాలి. నగర విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి. బకాయి ఉన్న డిఏలు ఇంక్రిమెంట్ లు తక్షణమే చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం బే షరతుగా తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు పొదిలి బాబు రావు, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, సిద్ధూ, అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, వెంకటనారాయణ, హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శిలు లాల్ స్వామి, అంజి, సంపత్, వల్లంశెట్టి వెంకటరమణ, ఆకుల అశోక్, ఆకుల ప్రసాద్, కార్యక్రమాల కమిటీ సభ్యులు వెంకటేష్ పామురాయ్, సంతోష్, మధు, వీరమహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి దాసరి సరిత, శ్రీమతి అరుణ, శ్రీమతి అంజలి, శ్రీమతి హర్షిత, నాయకులు ఎస్ నజీర్, డాలర్ మధు, తాతయ్య, చిరు, హీద్ధూ, సీనా, నజీమ్, హరీష్, హరి, విజయ్ దేవర రాయల్, వంశీ, సాదిక్, నవీన్, మంజునాథ్, షేక్షావలి, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.