జూమ్ మీటింగ్ ద్వారా పాలకొండ నియోజకవర్గo వీరఘట్టం జనసైనికుల సమావేశం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గo వీరఘట్టం మండలం జనసైకులు జూమ్ మీటింగ్ ద్వారా సమావేశం నిర్వహించారు. జనసేన మండలం అద్యక్షుడు మత్సపుండరీకం మాట్లాడుతూ మండలం పరిధిలోని ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జండా ఎగురవేయలని, ఈ సంక్రాంతి కి ఇతర ప్రాంతాల్లో ఉండి వచ్చిన వారితో ఈనెల 19 వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, వీరఘట్టం మండలంలో జనసేన పార్టీని పటిష్టం చేసేందుకు మీ మీ గ్రామాల్లో పార్టీ సిద్దాoతాలు ప్రజలకు తెలిసేవిధంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు మీ గ్రామ పరిధిలో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి పార్టీ సమాచారం తెలుసుకోవాలని కోరారు. ఈ జూమ్ సమావేశంలో BSU లీడర్ గర్బపు నరేంద్ర, డాక్టర్ దత్తి గోపాలకృష్ణ, వావిలపల్లి నాగభూషణం, పవన్ సాయి మరియు 50మంది జనసైనికులు ఈజూమ్ సమావేశంలో పాల్గొన్నారు.