విద్యుత్ ప్రమాదం బాధితునికి భరోసా ఇచ్చిన పాలూరు బాబు

బొబ్బిలి, బొబ్బిలి కేంద్రంలో 132/33కేవీ సబ్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో వాడాడ గ్రామానికి చెందిన వ్యక్తి జనార్దన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు జనసేన టీం ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది అని విషయం తెలుసుకోవడం జరిగింది, అలాగే కార్మికులు అంతా కలిసి ప్రమాదం జరగడానికి మూల కారణం అయిన ఆఏఈపై కేసు పెట్టడానికి ముందుకు వస్తే బొబ్బిలి సీఐ నిరాకరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఈ సమస్యపై పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాట్లాడడం జరుగుతుందని గాయపడిన కార్మికునికి అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.