మందుబాబుల ఆగడాలకు మహిళలలో భయాందోళనలు

మదనపల్లె, మందుబాబులు ఆగడాలు శృతి మించుతున్నాయి. విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. బడి, గుడి అనే భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మహిళలైతే ఒంటరిగా వెళ్లడానికి భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాలు అయితే బార్లు తరహాలో దారులు నిలయంగా మారాయి. ఈ మార్గాల్లో జనం రావడానికి భయపడుతూ ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. మద్యం తాగే వారి విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసేవారే లేకపోయారు. అన్నమయ్య వైయస్సార్ జిల్లాలో మందుబాబులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలలు మైదానాలు మార్కెట్ యార్డులు బైపాస్ రోడ్లు ఖాళీ ప్రాంతాలను మందుబాబులు తమ అడ్డాగా చేసుకుంటున్నారు దీనికి కారణం జనావాస ప్రాంతాలలో మద్యం షాపులు ఉండటమే, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది. కానీ ప్రజా రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇకనుండి అయినా స్పందించి ప్రజావాసాల మధ్య మద్యం షాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.