పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రౌండ్ టేబుల్ సమావేసం

నెల్లూరు: రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రౌండ్ టేబుల్ సమావేసం రాష్ట్ర అధ్యక్షులు పి.టోనీ బాబు అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమావేసంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు పి.టోనీ బాబు గారు మాట్లాడుతూ.. 1996 సినీ రంగ ప్రవేశంతో ఎందరో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య వైవిధ్యమైన నటనతో అభిమానులమైన మనం పవర్ స్టార్ ప్రభంజనంలో అంచెలంచాలగా విరాభిమానులైన ప్రతి సినిమాకు కరపత్రాలు పంచి, బ్యానర్లు కట్టి,ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి మన అభిమానాన్ని చాటుకున్నాము. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అభిమానల ఐక్యత వర్ధిల్లాలి అనే నినదానంతో ముందుకు సాగుతూ అభిమానం చాటుకుంటూ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం స్థాపించబడినది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పవన్ కళ్యాణ్ విరాభిమానులైన వాళ్ళ అంత ఒకే కార్యాచరణలో ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నత జీవన ప్రమాణాలను అందించాలని మనోగతంతో కులమతాలకు అతీతంగా 2014 లో అన్నయ్య స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జనసేన జెండాను మోసి జనసేనాని అభిమానతనికి గుండెనిండా అభిమానంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాము. దశాబ్దల కాలం రాజకీయ ప్రస్థానంలో పడిలేచిన కెరటంలా ఎన్నో ఒడిదాడుకులను, అవరోధాలను ఎదుర్కొని అలుపెరగని పోరాటం చేస్తున్న మన అన్నయ్యకు ప్రతి అభిమాని రాజకీయ కుయుక్తులు చీకట్లను చీలుస్తూ 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచి లాగా నిలిచిన జనసేనానికి గ్రహణం వీడిన సూర్యుని లాగా, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని సైనికుడై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న వేలాది అభిమానుల అభిమానాన్ని జనసేన ఓటుగా మార్చడానికి కార్యచరణ రూపొందించుకొని జనసేన మరియు జనసేన ని బలపరిచిన అభ్యర్థుల విజయమే ధ్యేయంగా జనసేన అని అత్యున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా వ్యూహ రూపకల్పనలో భాగంగా 28 1 2024 ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలో ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది ఈ సమావేశానికి 26 జిల్లాల్లోని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల నాయకులు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమ చివరి పంక్తులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన అధ్యక్షులు పి.టోనీ బాబు ఐదు ముఖ్యమైన తీర్మానాలతో ప్రమాణాలు చేయడం జరిగింది.
రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానులందరు ఏకధాటిగా పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడివుండటం. జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయం కొరకు ముందుకు సాగడం. పవన్ కళ్యాణ్ అభిమానులు 2014 సం. లో పనిచేసిన ప్రతి కుటుంబాన్ని కలిసి జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయం కొరకు తోడ్పడటం. ప్రతి ఇంటిటికి జనాసేనాన్ని మేనిపేస్టోని తీసుకెళ్లడం. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వారధిగా ఒక నాయకున్ని ఎన్నుకోవడం. పై తీర్మానాలను వచ్చిన ప్రతి ఒక్కరు ఆమోదించి తీర్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి చందు(విజయవాడ), సురేష్(ఒంగోలు), శివ(విజయవాడ), రవి(వినుకొండ), సోమశేఖర్(తిరుపతి), రామకృష్ణ(తెనాల), విజయ్, గోపి(కర్నూలు), అలీ(హైదరాబాద్). నెల్లూరు జిల్లా నుండి డాకత్తి తిరుమల, శ్రీపతి రాము, మురళి, భిమారావు, ప్రవీణ్, కాకి శివ, సుబ్బు, శ్రీనివాసులు, రాము, శ్రీను, వెంకీ, భాను ప్రకాష్, పృథ్వి, అమరావతి రాజా, షాన్వాజ్, బాజి తదితరులు పాల్గొన్నారు.