జనహితమే తన అభిమతంగా ముందుకు సాగుతున్న నేత పవన్ కళ్యాణ్

  • ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులపై, సమస్యలపై జనసేన పార్టీ పోరాడుతుంది.
  • పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా రోజూ కొంత సమయం కేటాయించి కష్టపడదామని జనసేనశ్రేణులకు బత్తుల పిలుపు.
  • అర్హులైన వారికి అనేక పథకాలు అందకపోయినా కుంటి సాకులు చెబుతూ అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
  • కోటి గ్రామంలో అనేక చోట్ల సీసీ రోడ్లు లేవు, డ్రైన్లలో పూడికలు తీయడం లేదు.
  • విద్యాశాఖ నిర్లక్ష్యం, పాలకుల అసమర్ధత వల్ల గ్రామీణ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందక, వసతులు కొరత వలన విద్యార్థులు చదువుల కోసం పట్టణాలకు వలస వెళ్లవలసి వస్తుంది.
  • కక్షపూరిత, వ్యర్ధపాలనతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజల్ని అంధకారంలోకి నెట్టుతున్నారు వైసీపీ నేతలు.
  • భావితరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పరితపిస్తుంటారు.
  • రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట “పవన్ రావాలి” “పాలన మారాలి”

రాజానగరం, “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” 89వ రోజులో భాగంగా “ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం” కోరుకొండ మండలం, కోటి గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల మహిళల విశేష ఆదరణతో, సుదీర్ఘంగా గ్రామంలో కొనసాగింది. స్థానిక గ్రామస్తులతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఈ ప్రభుత్వ దురాగతాలపై ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ, అక్రమ కేసులు బనాయిస్తుందని, ఈ అరాచక పాలన నుండి విముక్తి పొందాలంటే అందరూ సమిష్టిగా మాట్లాడుకుని, మంచి పాలన కోసం ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి, ‘పవన్ కళ్యాణ్’ కి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత ఆశయం ఉన్న నాయకుడు మన రాష్ట్రానికి లభించడం మన అదృష్టమని, ఆయన రాజకీయ లక్ష్యం కోసం జనసైనికులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కష్టపడి, పార్టీ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిస్తున్నా”నన్నారు. కోటి గ్రామంలో మూడవ రోజు జరిగిన “మహాపాదయాత్ర”లో గ్రామ జనసేన యూత్, వీరమహిళలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.