బిజెపి – జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలి

  • జనసేన నాయకులు, జనసైనికులు
  • పవన్ కళ్యాణ్ ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని మోడీ బిజెపి రాష్ట్ర నాయకులతో అన్నారు.

తిరుపతి, ఆదివారం మీడియా సమావేశంలో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు బాబ్జి, శ్రీమతి సుభాషిని, శ్రీమతి కీర్తన, ఆనంద్, సుమన్ బాబు, పార్ధు, చరణ్, సుజిత్ మరియు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులతో కలిసి డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ లు మాట్లాడుతూ ఒక్క రాత్రిలో రాష్ట్ర రాజకీయ చర్చలు మారిపోయాయి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా రెండు రోజులు ఏపీలో పర్యటించనున్న సందర్భంగా బిజెపి, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని దీన్ని డిమాండ్ లేదా మా అభ్యర్ధన అయినా అనుకోవచ్చని అన్నారు. రాష్ట్ర స్థాయి కాదు ఢిల్లీ స్థాయి వ్యక్తులు ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నాయకులు, జనసైనికులతో పాటు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని, రెండు రోజల పర్యటనలో నడ్డా ఏపి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు. నాడు 2014 ఎపి ప్రచారంలో భాగంగా మోడీ పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర బిజెపి నాయకులు పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలని అన్నారు, మరి పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో, లేక పువ్వులే పెడతారో మీ ఇష్టం అని వాపోయారు. రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది, జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పరిపాలనలో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు, నేటి రాష్ట్ర రాజకీయాల పట్ల ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితులను గమనించి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ఆవస్యకత ఎంతైనా ఉంది అని బిజెపి రాష్ట్ర, జిల్లా కమిటీ జాతీయ అధ్యక్షులకి మా విన్నపం ఒక్కటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.