పోలీసు ఆంక్షల మధ్య పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ కోసం రాజమండ్రికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణులు ప్రతి అడుగులో ఘన స్వాగతం పలికారు. ఉదయం 10.30 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి 11 గంటలకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి బయలుదేరారు. వందలాది మంది జన సైనికులు కదలిరాగా కొంతమూరు, క్వారీ సెంటర్, లాలా చెరువు జంక్షన్ల మీదుగా కేంద్ర కారాగారానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా రాజమండ్రిలో పోలీసులు మితిమీరిన ఆంక్షలు అమలు చేయడంతో జన సైనికులు, వీర మహిళలను ఎక్కడికక్కడే కట్టడి చేశారు. అయినా రోడ్డుకిరువైపులా నిలిచి శ్రీ పవన్ కల్యాణ్ గారిని తమ నగరానికి సాదరంగా ఆహ్వానించారు. వాహనం నుంచే అందరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు టీడీపీ నేతలు శ్రీ నందమూరి బాలకృష్ణ, శ్రీ నారా లోకేష్ లు చేరుకున్నారు. జైలు నిబంధనల మేరకు గేటు వద్ద ములాఖత్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. అధికారులకు తన ఆధార్ కార్డు తదితరాలు సమర్పించి, రిజిస్టర్ లో రాయించుకుని లోపలికి వెళ్లారు. అనంతరం శ్రీ బాలకృష్ణ, శ్రీ లోకేష్ లతో కలసి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అయ్యారు. ఈ భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. అనంతరం కేంద్ర కారాగారం బయట టీడీపీ, జనసేన అగ్ర నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు.
• శ్రీమతి భువనేశ్వరికి పరామర్శ
అక్కడి నుంచి శ్రీ చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి బస చేసిన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో కొంతసేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో నారా లోకేష్, బాలకృష్ణ, శ్రీమతి బ్రాహ్మణి పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ కు తిరుగు పయనం అయ్యారు. ఈ పర్యటనలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, పి.ఎ.సి. సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు శెట్టిబత్తుల రాజబాబు, అనుశ్రీ సత్యనారాయణ, బండారు శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, పాటంశెట్టి సూర్యచంద్ర, వై.శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, వరుపుల తమ్మయ్య బాబు, పోలిశెట్టి చంద్రశేఖర్, తోట సుధీర్, పంచకర్ల సందీప్, విడివాడ రామచంద్రరావు, మేడా గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి ప్రియా సౌజన్య, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.