బిశ్వభూషణ్ హరిచందన్ కి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి మీ వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎంతో ఉపయుక్తమని భావిస్తున్నాను. అవినీతిలేని సమాజం ఆవిష్కారం కావాలన్న మీ ఆకాంక్ష నేటితరం రాజకీయవేత్తలకు ఆదర్శం. ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.