విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజాబాట

  • 67వ రోజుకి చేరిన పవనన్న ప్రజా బాట
  • దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల పర్యటన
  • పుష్పవతి అయిన అమ్మాయికి పట్టుబట్టలు, వెండి పట్టీలు అందజేత

వైజాగ్ సౌత్: పేదల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం నాటికి ఈ కార్యక్రమం 67వ రోజుకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 34వ వార్డు కొబ్బరి తోట ప్రాంతానికి చెందిన పుష్పవతి అయిన అమ్మాయి రమ్యశ్రీకి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యంగా పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపించి వాటి పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని వెల్లడించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
32వ వార్డుతో పాటు దక్షిణ నియోజకవర్గంలో గల ఇతర వార్డులలో కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను మరిన్ని కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఒకపక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోపక్క ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని, ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటుతో గట్టిగా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నరేష్, గణేష్, రాజు, ప్రసాద్, హరీష్, ఆంటోనీ శేఖర్, రఘు, శ్రీను, మంగ, రాజేశ్వరి, దుర్గా, కుమారి, దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కేదార్నాథ్, బద్రీనాథ్ జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.