జగనన్న కాలనీలలో పెడన జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పెడన నియోజవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీల దుస్థితిపై #failureofjaganannacolony యాష్ ట్యాగ్ తో ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో డిజిటల్ క్యాంఫైన్ చేయాలని ఆదేశించడం జరిగింది. అధ్యక్షులు వారి ఆదేశానుసారం ఆదివారం పెడన నియోజవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మరియు కార్యకర్తల సంయుక్తంగా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పర్యటించి జగనన్న కాలనీలో ప్రస్తుత పరిస్థితులను ఫోటోలు ద్వారా వీడియోలు ద్వారా చిత్రీకరించడం జరిగింది. స్థానిక వైసీపీ నాయకులు పోలీసులు అనేక ఇబ్బందులు కలగజేసినప్పటికీ వాడిని లెక్కచేయకుండాకార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వైసిపి ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలపథకం అతిపెద్ద కుంభకోణం భూమి కొనుగోలు మౌలికోస్తుల కల్పన పేరట వేలకోట్ల అవినీతి జరిగింది. పెడన నియోజకవర్గంలో జగనన్న కాలనీలో మౌలిక వసతులు కలపలేదు. కేటాయించిన స్థలాలు కూడా ఊరికి దూరంగా నివాసయోగ్యానికి అనుకూలం లేని ప్రదేశాలు. పెడన నియోజకవర్గస్థానిక ఎమ్మెల్యే మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పూర్తిగా శాఖ నిర్వహణలో విఫలమయ్యాడు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి ప్రెస్ మీట్ లు పెట్టడానికి తప్పపనికిరాని పనిరాని మంత్రిగా చరిత్రహీనుడుగా మిగిలిపోనున్నాడు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం గూడూరు మండలం కోకనారాయణ పాలెం, తలకటూరు,
మద్దిబట్ల, గురిజేపల్లి, పెడన మండలంలోని బల్లిపర్రు గ్రామంలలోని జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. అది జగనన్న కాలనీ చెరువులు తలపిస్తుంది. మౌలిక వసతులు మాట లేదు ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని హరిరాం నియోజవర్గ నాయకుడు, ఎస్ వి బాబు, మండల ప్రధాన కార్యదర్శి గల్లా హరీష్, కనపర్తి వెంకన్న, వెన్న శ్రీనివాసరావు, బావిశెట్టి సుబ్బారావు, మట్టి పూర్ణచంద్రరావు, ఆత్మూరు సుబ్బారావు, శీలం ధనరాజ్, నాగేశ్వరరావు, ముదినేని రామకృష్ణ, పినిశెట్టి రాజు, సమ్మెట గణపతి, తోట సాయి, సమ్మెట చిన్ని, బాల, మురారి, తిరుమలనాద్ హరిహరన్, వంశీ, విష్ణు, చైతన్య మరియు పెద్ద ఎత్తున జనం సైనికులుగా పాల్గొన్నారు.