పున్యగిరి బాలికల హాస్టల్ ను సందర్శించిన వబ్బిన

శ్రీనగవరపు కోట నియోజకవర్గం: జనసేన నేతలు ఎస్ కోట కాలేజ్ అమ్మాయిల హాస్టల్ సందర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శనివారం స్థానిక పున్యగిరి హాస్టల్ అమ్మాయిలతో మాట్లాడిన జనసేన ఎస్. కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. అమ్మాయిల హాస్టల్లో 300 మంది ఉన్నారని, వారందరికీ ఇప్పుడున్న వసతి బిల్డింగ్లు 2రెట్లు నిర్మించాలని హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ వర్షము వస్తే నీటితో నిండిపోయి గోతులు ఉన్నాయని, తుప్పలు బలిసి పాములు భయముతో విద్యార్థినులు భయపడుతున్నారని, తుప్పలు కొట్టించి వెంటనే గోతులు పుడ్చాలని, ఫ్రంట్ గేట్ పెట్టాలని, వీటన్నిటికీ జగన్ ప్రభుత్వం నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థినులకు మెనూ ప్రకారము బోజనాలు పెట్టడము లేదని, విద్యార్థినులకు పౌష్టికాహారం సరిపడక అర్ధాకలితో సరిపెట్టు కుంటున్నారని, వార్డెన్ కూడా స్థానికంగా నివాసము లేక వారు అభద్రతకు గురి అవుతున్నారని, వారికి మంచాలు, కంచాలు, పెట్టెలు, దుప్పట్లు ప్రభుత్వమే సప్లై చేయాలని జనసేన నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాలేజ్ హాస్టల్ విద్యార్ధినుల తరపున జనసేన పార్టీ పోరాడి ప్రభుత్వంపైన వత్తిడి తీసుకు వస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎస్ కోట మండల పార్టీ అధ్యక్షులు కొత్యడ రామకోటి, జామి జనసేన నేతలు వర్మ రాజు, దేగల అప్పలరాజు, వేపడ మండల నాయకులు రుద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.