యానాదులతో సహపంక్తి భోజనం చేసిన పెడన జనసేన నాయకులు

  • కులాలను కలుపుతూ రాజకీయ వ్యవస్థను నిర్మించడం జనసేన పార్టీ మూల సిద్ధాంతం.

పెడన మండలం, చెన్నూరు గ్రామంలో ఆదివారం రాత్రి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు గ్రామంలోని యానాదులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది. ఈనెల 13వ తేదీన పెడన నియోజవర్గంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో 42 మంది యానాదులు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. చెన్నూరు యానాదుల కాలనీలో నీటి సమస్య ఉందని యానాదులు జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. 24 గంటల్లోపే జనసేన నాయకులు బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించారు. ఆ నీటి బోరును జనసేన నాయకులు, చెన్నూరు గ్రామ ప్రజలు మరియు యానాదులు కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యానాది సోదర, సోదరీమణులతో కలసి సహబంతి భోజనం చేసి జనసేన పార్టీ నాయకులకు అట్టడుగు వర్గాలపై ఉన్న ప్రేమను తెలియజేశారు. ఈ సందర్భంగా యానాది సంఘ నాయకుడు పాండు మాట్లాడుతూ తమ నీటి సమస్య తీర్చిన జనసేన నాయకులు ఎస్ వి బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. మాతో కలిసి జనసేన నాయకులు సహబంతి భోజనం చేయటం మాకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, ఎస్ వి బాబు, పండమనేని శ్రీనివాస్, ఊస వెంకయ్య, తిరుమణి రామాంజనేయులు, బిజెపి నాయకులు గాజుల సిద్ధార్థ, నవీన్ కృష్ణ, శీరం సంతోష్, పాశం నాగమల్లేశ్వరరావు, దాసరి నాని, పినిశెట్టి రాజు, సమ్మెట ప్రమీల, కనపర్తి వెంకన్న, మద్దినేటి రామకృష్ణ, పుల్లేటి దుర్గారావు, ముచ్చర్ల సురేష్, బావిరెడ్డి రవి, సమ్మెట శివ, సమ్మెట గణపతి, సమ్మెట చంద్రశేఖర్, సమ్మెట చిన్ని, కోలపల్లి చంద్రశేఖర్, బుద్ధన బాబి, వాసుదేవ కృష్ణ, పులగం శీను, కొప్పునేటి ఆదిశేషు, మర్రి సీతారాం, పుప్పాల కొండ, మరియు పెద్ద ఎత్తున జనసైనికులు, చెన్నూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.