కరెంట్ చార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వాన్ని అంధకారంలోకి నెట్టనున్న ప్రజలు

విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు జనసేన ఉద్యమం ఆగదు – డా.పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం మరియు వివిధ నియోజకవర్గాల ఇంచార్జులుతో కలసి చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ… పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు జనసేన ఉద్యమం తగ్గేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చేతితో సహాయం చేసి, ఇంకో చేత్తో ప్రజల నుంచి పన్నుల రూపంలో దోచుకునే ముఖ్యమంత్రి గద్దె దిగడం ఖాయమని, ప్రజలే ఓడించే రోజులు దగ్గరలో ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రం రావణకాష్టం అయిందని, భారంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు సుఖంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలు అయినా సరే అభివృద్ధిలో మాత్రం శూన్యమని, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ఘడియలు ఆసన్నమయ్యాయని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గల జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికుల ఆధ్వర్యములో చిత్తూరు కలెక్టర్ కార్యాయంలో ఏఓకి వినతి పత్రం సమర్పించి, కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, పోన్నా యుగంధర్, కోట చంద్ర బాబు, వెంకటరమణా, రాజేష్ యాదవ్, బాబ్జీ, వనజ, ముక్కు సత్యవంతుడు మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.