పెరవలి భాస్కరరావుకు భరోసానిచ్చిన విడివాడ

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, కంతేరు గ్రామంలో పెరవలి భాస్కరరావు అనే వ్యక్తి సెలూన్ షాప్ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి పెరవలి భాస్కరరావుకు రూపాయలు 5000/- ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంతేరు గ్రామం జనసేన నాయకులు పెంచెట్టి దుర్గాప్రసాద్ తానేటి ప్రభాకర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు మండలం పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ తామరపు నరసింహారావు (చిన్న), తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు తులసీరామ్, తణుకు పట్టణం ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.