పౌరులు ముందుకు వచ్చి సాయమందించేలా పోలీసులు ధైర్యాన్ని నింపాలి

కావలి, మంగళగిరిలో నాదెండ్ల మనోహర్ ని కలిసి వస్తున్న నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కావలి దాటిన తర్వాత రేగడి చిలక వద్ద ప్రమాదానికి గురి అయిన కియా కారు చూసి ఎవరూ ముందుకు రాకపోవడంతో ముందుకు వెళ్లి వారిని క్రాస్ చేసిన వెహికల్ అని గుర్తించి కారు ఎత్తి ముందు అద్దం పగలగొట్టి చూడగా అందులో రెడ్ క్రాస్ చైర్మన్, నెల్లూరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అద్దం పగలగొట్టగా ఆయనే బయటికి వచ్చాడు. కనత మీద గాయమై ఉంది. అతని పీఏ వెంకటేశ్వర్లు అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నారు. దాదాపు 20 నిమిషాలు 108 కోసము పోలీస్ వారి కోసం వెయిట్ చేయగా రాలేదు. పలుమార్లు చంద్రశేఖర్ రెడ్డి కిషోర్ ని గుర్తించి మీరు కిషోర్ కదా ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇక్కడ ఏం జరిగిందని పదేపదే ప్రశ్నించడం చూసి మానసికంగా ఏదైనా జరుగుతుందని ఉద్దేశంతో అతన్ని వారి కారులో అపోలో హాస్పిటల్ కి తరలించారు. దాదాపుగా ఒక హాఫ్ లీటర్ బ్లడ్ తల నుంచి కారింది. అపోలో చేర్పించి స్కానింగ్ అంతా తీయించగా నార్మల్గానే ఉంది అని చెప్పారు. ఆయన ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లే. ప్రమాదానికిలోనై గాయాల పాలైన చంద్రశేఖర్ రెడ్డిని కాసేపు పరామర్శించి 108 రాకపోవడంతో లేట్ అవుతుందేమో అని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు యాక్సిడెంట్ మీరు చేశారా అని ప్రశ్నించారు. ఇది కొంత బాధాకరంగా ఉందని, అప్పటికే ఆక్సిడెంట్ అయి పది నిమిషాలు అయినా కూడా ఎవరూ ముందుకు వచ్చి ఆ కారు ఎత్తని పరిస్థితి, వీటి నుంచి గురించి పోలీసు వ్యవస్థ పౌరులకు ఆపన్న సమయంలో పౌరులు ముందుకు వచ్చి ఇటువంటి హాస్పిటల్ కు తీసుకెళ్లడం వంటి చర్యలు చేయవచ్చు అనే ధైర్యాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.