ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక జనసేన తీర్థం పుచ్చుకున్న వైసిపి టిడిపి కార్యకర్తలు

జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా అధికార ప్రతినిధి శ్రీ రాములు ఆధ్వర్యంలో చేరికలు

అరకు నియోజకవర్గం, అరకు మండలం గన్నెల పంచాయతీ పరిధిలో గల డప్పు గూడా గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల సమయమున జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి, సాయిబాబా దురియా పార్లమెంట్ అధికార ప్రతినిధి శ్రీ రాములు, సన్యాసిరావు, గేమ్మిల, రామకృష్ణ తదితరులు ఆ గ్రామంలో పర్యటించి గిరిజనులతో సమావేశమయ్యారు గ్రామంలో నెలకొన్న సమస్యల మీద చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా సాయిబాబా, దురియా, మాదల శ్రీ రాములు మాట్లాడుతూ డప్పు గూడా గ్రామంలో రోడ్లు సదుపాయం అస్తవ్యస్తంగా ఉందని, గొప్పలు చెప్పుకునే ఈ వైయస్సార్ ప్రభుత్వం మెరుగైన రోడ్లు సదుపాయం కల్పించలేకపోతుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు, అభివృద్ధిలో ప్రజలను ఆమడదూరంలో పెడుతున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్పాలని గిరిజనులను సూచించారు, కావున రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో పరిపాలిస్తున్న జగన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రజల పక్షాన నిలబడి నిత్యం పోరాటం చేస్తున్న, జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చేసేందుకు మీ వంతు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, జనసేన పార్టీకి ఆదరించాలని, జనం కోసమే జనసేన పార్టీ పుట్టుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు వైఎస్సార్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం పై నమ్మకం లేకే జనసేన పార్టీలో రోజు రోజుకి వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు జనసేన తీర్థం పుచ్చు కొంటున్నారని, ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలన ప్రభుత్వానికి సూచించారు, జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో టిడిపి, వైసిపి నుంచి గడప బంటు ప్రసాద్, పాలెపు సుందర్రాజు, గడప అంటూ భీమన్న, గడ బంటు గోవింద్, గడ్డ బంటు గురు వీరితో పాటు సుమారు 20 మంది టిడిపి వైసిపి కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, ఈ కార్యక్రమంలో గిరిజనులు అత్యధికంగా పాల్గొన్నారు.