నల్లల రామకృష్ణను పరామర్శించిన ప్రత్తిపాడు జనసేన నాయకులు

ప్రత్తిపాడు నియోజకవర్గం, శంఖవరం మండలం, అన్నవరం గ్రామం దగ్గరలో ఇటీవల అనగా 9 వ తేదీ శుక్రవారం నాడు జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణని గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేయడం జరిగింది. దీనిని తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషరావు, జనసేన నాయకులు మరియు జనసైనికులు నల్లల రామకృష్ణ స్వగృహంలో వారిని కలిసి వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాట్లాడుతూ రామకృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ తోడుగా ఉంటుందని, దోషులకు తగిన శిక్ష పడే విధంగా కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.