జెడ్డా శ్రీనుకి మనోధైర్యాన్నిచ్చిన ప్రత్తిపాడు జనసేన నాయకులు

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు గ్రామస్థులు మెగా అభిమాని, సీనియర్ నాయకులు జెడ్డా శ్రీను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకున్న జనసేన నాయకులు గోపిశెట్టి శ్రీను స్పందించి నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) చేతుల మీదుగా వారిని పరామర్శించి ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడేలా నిత్యావసరాలను మరియు రూపాయలు 10,000 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల మండల అధ్యక్షులు గాబు సుభాష్, ప్రత్తిపాడు జనసేన నాయకులు లాజర్, బొబ్బర్ల చిన్ని, కొండవీధి జనసైనికులు, పల్లపు వీధి జనసైనికులు పాల్గొన్నారు.