సర్వేపల్లిలో విలేకరుల సమావేశం

సర్వేపల్లి, ముత్తుకూరు పట్టణ కేంద్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వస్తుండడంతో సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకొని ఉన్న ఐదు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి వినతిపత్రం రూపంలో తీసుకుని వెళ్తాం. సర్వేపల్లి నియోజకవర్గం అంటే నెల్లూరు జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఎక్కడ పట్టిన సమస్యలు నెలకొని ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు మంత్రి అయిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదు. సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. అలాంటి నియోజకవర్గం గడచిన మూడేళ్లగా అభివృద్ధిలో వెనుక పడడంతోపాటు అనేక సమస్యలతో సతమతమవుతున్న జిల్లా మంత్రి కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లా మంత్రి కాసులకే పెద్ద పీట వేస్తూ, అవినీతి, అక్రమాలు, దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ఐదు ప్రధాన సమస్యలలో 1 నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్నటువంటి దళిత ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. 2 దేవరదిబ్బ దగ్గర నివసిస్తున్నటువంటి 300 కుటుంబాలు యాష్ పాండ్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. 3 పంటపాలెం గ్రామపంచాయతీలో ఆయిల్ కంపెనీలకు భూగర్భ జలాలను తరలిస్తున్నారు. దాన్ని పూర్తిగా నిలిపి వేయాలి. 4 సర్వేపల్లి గ్రామములోని జోసఫ్ పేట వద్ద ఉన్న సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద నిర్మించిన వాటర్ ప్లాంట్ ముత్తుకూరు, వెంకటాచలం మండలాలకు తాగునీరు అందించేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ ప్లాంట్ మూతపడి ఉంది. ఆ వాటర్ ప్లాంట్ ను వెంటనే పునరుద్ధరించి వెంటనే రెండు మండలాల ప్రజలకు తాగునీరు అందించాలి. 5 పొదలకూరు మండలంలో రూ.4 కోట్ల రూపాయలతో ప్రతి కుటుంబానికి రూ.2 రూపాయలకే తాగునీరు అందించాలని గత ప్రభుత్వంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను స్థానిక శాసనసభ్యులైన జిల్లా మంత్రి రాజకీయ ఉద్దేశపరంగా కావాలని మూసి వేయించారు. దీంతో ప్రజాధనం వృధా కావడం తప్ప మరొకటి లేదు. రాజకీయ పార్టీలు వారికి అనుగుణంగా రాజకీయాలు చేసుకుంటాయి. కానీ ప్రజల కోసం నిర్మించింది మూసివేయడం సరైన పద్ధతి కాదు. దాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకొని రావాలి. ఈ ఐదు సమస్యలతోపాటు సర్వేపల్లి నియోజకవర్గమంతట ఎక్కడ చూసినా మంత్రి అనుచరుల అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇసుక, గ్రావెల్ దోపిడిని అరికట్టాలి. ప్రజలతో కలిసి ప్రజల పక్షాన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇస్తాం. ముఖ్యమంత్రి సమస్యలను పరిష్కరించి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని పక్షంలో నిరసన తెలపడానికైనా సర్వేపల్లి జనసేన పార్టీ సిద్దం. తాము అడిగినటువంటివి పరిష్కారం చెయ్యకపోతే అవి పరిష్కారం అయ్యేంతవరకు నిరసన, దీక్ష కార్యక్రలాలు విడతల వారీగా చేపడతామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రహీమ్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, మల్లికార్జున్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.