అసెంబ్లీని ముట్టడిoచిన ప్రైవేటు టీచర్లు

ప్రైవేటు టీచర్లు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటికే మొహరించిన పోలీసులు.. అప్రమత్తం అయ్యారు. గన్‌పార్క్‌ దగ్గర కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్లను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో ఎక్కించారు.

ఆరు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కేసీఆర్ సారు మమ్మల్ని ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. తమకు ఆరు నెలలుగా.. యాజమాన్యాల నుంచి రావాల్సిన జీతాలు చెల్లించేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు.

TPTF ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వాళ్లు అసెంబ్లీకి చేరుకున్నారు. నల్గొండ, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన ప్రైవేటు టీచర్లు అసెంబ్లీని ముట్టడించారు. కరోనా, లాక్‌డౌన్ సమయంలో మూడు లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లు నిరుద్యోగులుగా మారిపోయారు.

దీంతో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రైవేటు యాజమాన్యాలు తొలించాయి. ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకుని బతుకీడుస్తున్న చాలా మంది ప్రైవేటు పాఠశాల టీచర్లు రోడ్డున పడ్డారు.