కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్ దగ్గర నిరసన

కాకినాడ సిటీ, విశాఖపట్నంలో జనసేన నాయకులను అక్రమ అరెస్టులకి నిరసనగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, జనసేన నాయకులు 21 డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్, కార్యాకర్తలు, వీర మహిళలు భానుగుడి సెంటర్ దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. నిరసన చేస్తున్న వారిని పోలీస్ వారు అరెస్ట్ చేసి పోర్ట్ స్టేషన్ కి తరలించడం జరిగింది.