శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం చెయ్యనందుకు నిరసన ర్యాలీ

శ్రీకాళహస్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మద్యపాన నిషేధం పై మాట తప్పి, మడమ తిప్పి మద్యపాన నిషేధం హామీ అమలు చెయ్యనందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆదివారం పెద్ద ఎత్తున వందల మంది నియోజకవర్గ మహిళలతో కలిసి మద్యం దుకాణం ముందు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి మద్యపానంతో అభిషేకం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన దగ్గర ఉన్న మద్యం షాప్ నుండి పెళ్లి మండపం మీదుగా నాలుగు మాడ వీధుల్లో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యపాన నిషేధం పేరుతో 2019 ఎన్నికల్లో మహిళల ఓట్లతో గెలిచిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యం ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న అసమర్థుడు, మోసగాడు జగన్ అన్నారు, 2024 ఎన్నికలకి పూర్తిగా మద్యం షాపులు తొలగించి ఓట్లకు వస్తానన్న జగన్ ఇప్పుడు ఏమి మొహం పెట్టుకుని ఓట్లకు వస్తాడని, మానిఫెస్టోలో ఉన్న అంశాలు బైబిల్ గాను, ఖురాన్ గాను, భగవద్గీతగా భావిస్తానని ప్రగల్భాలు పలికే జగన్ మద్యపాన నిషేధంలో హామీ నిలబెట్టుకొలేనిదానికి ఏమి సమాధానం చెప్తాడు. జగన్ కి ఏ మాత్రం చిత్త శుద్ది ఉన్నా కూడా స్వచ్చందంగా 2024 ఎన్నికల బరిలో నుండి వైసీపీ పార్టీ తప్పుకోవాలని మండిపడ్డారు. మాట తప్పి, మద్యపాన నిషేధం చెయ్యకుండా, అధిక ధరలతో కల్తీ మద్యం అమ్ముతూ ఆడవాళ్ళ తాళిబొట్ల తెంపుతున్నాడని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్ల కోసం గ్రామాలకు వస్తే మహిళలు తరిమి తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, పేట శారద, పేట గాయత్రి, భాగ్య లక్ష్మి, కావలి శారద, అనురాధ, జయలలిత, బత్తెమ్మ, విజయ, రాధ, మాధవి, మన్యం దేవి, నాయకులు తోట గణేష్, కావలి శివకుమార్, పేట చంద్ర శేఖర్, రవి కుమార్ రెడ్డి, చిరంజీవి, జ్యోతి రామ్, బాలాజీ, వెంకట రమణ, నితీష్, రాజేష్, హేమంత్ గౌడ్ , ముడుసు గణేష్, తదితరులు పాల్గొన్నారు.