తిలక్ నగర్ లో ప్రజా సంకల్ప యాత్ర

  • ఏలూరు నియోజకవర్గం 47వ డివిజన్ తిలక్ నగర్ లో ప్రజా సంకల్ప యాత్రను నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

ఏలూరు: పది రోజుల నుంచి ఏలూరులోని ప్రజలు మంచినీరు లేక అల్లాడుతుంటే పరిపాలకులు, ఎమ్మెల్యే ఆళ్ళనాని నిద్రావస్థలో ఉన్నారని ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి చంటి మండిపడ్డారు. స్థానిక 47వ డివిజన్ పరిధిలోని తిలక్ నగర్ శనివారం సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి. జరుగుతున్న పరిణామాలపై ప్రజల్ని చైతన్య పరచాలి. ప్రజలు కూడా చైతన్యవంతులవుతున్నారు. అందరు కూడా స్వేచ్ఛగా బయటికి వచ్చి వారి గళాన్ని మాకు వినిపిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయం కోసం ప్రజలు గెలవాలనే నినాదంతో జనాల్లో తిరుగుతున్నారని, ప్రజలందరూ కూడా సహకరించడానికి ముందుకొస్తున్నారు.. రానున్న రోజుల్లో ఈ సైతాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఎవరి వంతు వారు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని, తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన టిడిపి బిజెపి పార్టీల కార్యకర్తలందరూ కూటమికి పట్టం కట్టాలని, శక్తివంచన లేకుండా పనిచేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని బడేటి చంటి వివరించారు.. తిలక్ నగర్ లో సానిటైజర్ వ్యవస్థ మరుగున పడి పూర్తిగా నిర్వీర్యం అయింది.. ఏలూరులో పది రోజుల నుండి కనీసం మంచినీరు దొరికే పరిస్థితి లేదని, అనేకమంది ప్రజలు నీరు లేక అల్లాడుతుంటే పరిపాలకులు ఎమ్మెల్యే ఆళ్ళనాని మొద్దు నిద్రలో ఉన్నారని ఆయన మండిపడ్డారు.. వేసవి కాలం వచ్చిందని, ముందు చూపులేని నాయకులు కనీసం ట్యాంకర్ కానీ నీటి సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రజా నాయకులైతే మొద్దు నిద్ర పోతున్నారని, వీళ్ళందరికీ రాష్ట్రవ్యాప్తంగా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని డివిజన్ వాసులకు పిలుపునిచ్చారు. మా డివిజన్ లోకి ఆళ్ళనాని వస్తే ఖచ్చితంగా వారిని నిలదీస్తామని ఇక్కడి స్థానికులు చెబుతున్నారని, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని, దానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. దివంగత నేత స్వర్గీయ మా అన్నగారైన బడేటి బుజ్జి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో, ఏ విధమైన సదుపాయాలను ప్రజలకు కల్పించామో, ఇప్పుడు కూడా అలాంటి పరిపాలనను ప్రజలకు అందిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని అన్నారు.. ఇప్పుడు ఏలూరులో బడేటి బుజ్జిగారి రుణం తీర్చుకునే అవకాశం ప్రజానీకానికి వచ్చిందని కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, రెడ్డి గౌరీ శంకర్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, నిమ్మలశ్రీనివాసు, నూకలసాయిప్రసాద్, జనసేన రవి, కురెళ్ళ భాస్కర్, అరవింద్, మేక సాయి, దాసరి శ్రీరామ్, వాసు నాయుడు వీరమహిళలు తుమ్మపాలఉమాదుర్గ, గుదే నాగమణి మరియు భారీ సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.