పట్టాలు ఇచ్చారు- స్థలాలు ఎక్కడ?

  • జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం: నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం కార్యక్రమంలో గండేపల్లి మండల రామయ్యపాలెం గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రామయ్యపాలెం గ్రామంలోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో చాలా మంది నిరుపేద మహిళలు చెప్తున్న ఒకే ఒక్క సమస్య సొంత ఇళ్ళు లేని వారికి ప్రభుత్వం ఇచ్చిన దొంగ ఇళ్ళ పట్టాలు గురించి. మా పేర్లు వివరాలతో పాటు ప్లాట్ నంబర్ తో సహా గత 2020వ సంవత్సరంలో వైఎస్సార్ ఆశీస్సులతో జగనన్న ఇళ్ల పట్టా అని ఇచ్చారు కానీ నేటి వరకు ఆ స్థలం ఎక్కడ ఉందో చూపించలేదు. ఆ గ్రామంలోని పట్టాలు పొందిన ప్రజలు అంతా కలిసి ప్రభుత్వ ఉన్నత అధికారుల దగ్గరకు వెళ్లి వారికి ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు స్థలాలు ఎక్కడ కేటాయించారు అని కోరగా, మీ పట్టాలో ఉన్న సర్వే నంబర్ ప్రకారం గండేపల్లి సమీపంలోని పోలవరం కాలువ గట్టుపై ఇచ్చారు అని చెప్పారు. జగనన్న చెప్పిన నవరత్నాలలో భాగంగా “పేదలందరికీ ఇళ్ళు” పథకం ద్వారా పేదలందరికీ ఇళ్ళ పట్టాలు వస్తాయని ఎంతో నమ్మి ఆయనకు ఓటు వేసి గెలిపించిన చాలా మంది పేద ప్రజలకు నివాస యోగ్యం కానీ కాలువ గట్లపై ఇళ్ళ స్థలాలు కేటాయించి వారందరినీ మోసం చేశారని అన్నారు. ఈ సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపిస్తే మీ లాంటి పేదలందరికీ గ్రామానికి చేరువలో చాలా నివాస యోగ్యమైన చోట ఇళ్ళ స్థలాలు కేటాయించడమే కాకుండా మీరు ఇళ్ళు కట్టుకోవడానికి ఇంటి లోనూ కూడా జనసేన ప్రభుత్వం ద్వారా అందించడం జరగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, రామయ్యపాలెం గ్రామ అధ్యక్షులు అక్కిరెడ్డి శ్రీను, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.