రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలి

జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట జనసేన పార్టీ జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాజంపేటలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాల కాలంగా రాజంపేట చరిత్రకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. రాజంపేట ను జిల్లాగా ప్రకటించేందుకు అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. నందలూరు లో బ్రిటిష్ కాలం నుంచి దేవాలయాలు ఆంధ్ర భద్రాదిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన తాళ్ళపాక అన్నమాచార్యులు జన్మస్థలం, భక్త కన్నప్ప ఆలయం చుట్టూ నీటి వనరులు రవాణా సదుపాయం అన్ని వసతులు ఉన్న రాజంపేట జిల్లాగా ప్రకటించకపోవడంతో అభ్యంతరం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట కాదని రాయచోటిని జిల్లాగా ప్రకటిస్తూ, అన్నమయ్య జిల్లాగా నామకరణం చేయడం అన్యాయమన్నారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతి పార్లమెంటు జిల్లాగా ప్రకటిస్తారని మాట ఇచ్చారన్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి మాట తప్పుతున్నార న్నారు. రాజంపేట ప్రజలు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి రాజంపేట అన్నమయ్య జిల్లాగా ప్రకటించే వరకు అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని ఆయన తెలియజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, ఆకుల నర్సయ్య, బండ్ల రాజేష్ , పోలిశెట్టి శ్రీనివాసులు, సుబ్బరాయుడు, తాళ్ళపాక శంకరయ్య ,జనసేన అక్క చెల్లెమ్మలు జనసైనికులు పాల్గొన్నారు.