రాజానగరం నియోజకవర్గం జనశ్రేణుల విస్తృత స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్

రాజానగరం నియోజకవర్గం, జనశ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసైనికులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక నమస్కారములు తెలియజేసారు. గత 10 సంవత్సరాల నుండి మీరు అందరూ మన ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, జనసేన పార్టీని గెలిపించాలన్న పట్టుదలతో, నిరంతరం కష్టపడుతూ పార్టీ కోసం అహర్నిసలు పనిచేస్తు, అధికార పార్టీవల్ల, మరియు స్థానిక నాయకుల వల్ల, అధికారుల వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. వాటిని ఎదురిస్తు, సంక్షేమ పథకాలు, ఇవ్వం అని బెదిరించినా.. పథకాలు కన్నా పార్టీ మిన్న అని నినాదంతో.. పార్టీని బలపరచడంలో మీరందరూ ప్రధాన పాత్ర పోషిస్తు- ఉరకలు వేస్తున్న ఉడుకు రక్తంతో, పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్న ధైర్యంతో.. ఎవరు మీకు స్థానికంగా అండగా ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ గారికి, మాకు దూరం కేవలం ఒక గుండె చప్పుడు మాత్రమే అని నమ్మిన ధైర్యంతో ముందుకు దూసుకు వెళ్తున్న జనశ్రేణులందరికి నా శిరస్సు ఒంచి పాదాభివందనాలు. తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టానికి ఫలితం రావడానికి కేవలం 5, 6 నెలలు మాత్రమే సమయం ఉంది. ప్రతి జనసైనికుడు ఇంత కాలం మనం చేస్తున్న ధర్మ యుద్ధం గెలుపుకు కేవలం 5,6 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి” ఉరకలు వేస్తున్న ఉడుకు రక్తంతో యువత, విద్యావేత్తలు, మేధా సంపన్నులు, అన్నం పెట్టె రైతన్నలు, రక్తాన్ని చెమటగా మారుస్తున్న కార్మిక సోదరులు, కుల వృత్తులను నమ్ముకున్న కార్మికులు, కరోనా కష్ట కాలం సైతంలో కూడా ప్రయాణికులను, సామాగ్రిని గమ్యానికి చేరుస్తున్న మోటారు కార్మిక సోదరులు, ఉద్యోగ ఉపాధి లేకున్న భవిష్యత్తు కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు, భూదేవి అంత సహనంతో కుటుంబాన్ని, బిడ్డలను, కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుతున్న మహిళామణులు, నారీశక్తికి, ఝాన్సీ లక్ష్మి భాయికి, దుర్గా భాయి దేశముక్కి, అన్నీ రంగాలలో మేము సైతం అంటున్న సోదరీమణులు, కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారస్తులు, రైతు కూలీలు, అందరం ఏకం అవుదాం రండి రాబోవు 6 నెలలు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం రాజానగరం నియోజక వర్గంలో జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం రండి. అందరం ఏకష్టులై పనిచేద్దాం. యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమయింది. పొత్తులు, వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారివి, దయచేసి అధికార పార్టీ వాళ్ళు సృష్టించే అపోహాలకు, అపార్థాలకు తావు ఇవ్వకండి. గత 10 సంవత్సరాలుగా మరుగుతున్న రక్తంతో ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో ఎన్నో సుత్తి, వులి దెబ్బలు తట్టుకుని బండరాయి భగవంతునిగా మారినట్లు, అన్ని విషయాలలో ఆరుతేరి పూర్తి అనుభవశాలిగా మారిన మన ప్రియతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయకండి. ఆయన కచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించటం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. జనసేన పార్టీని గెలిపించడం కోసం వారి వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. వారి నిర్ణయంలో జనసేన పార్టీకి, జనశ్రేణులకు మంచి భవిష్యత్తు ఉండేలా నిర్ణయం తీసుకుంటారు. మన అధినాయకుడి నిర్ణయం మనకి శిరోదార్యం. కొందరు జనసేన పార్టీ ముసుగు వేసుకుని మనల్ని తప్పు తోవ పట్టిస్తారు. దయచేసి జాగ్రత్త వహించండి. ఆవేశ పడకుండా బాగా ఆలోచించండి, మీకే బాగా అర్థమవుతుంది. ఆయన వ్యూహాలు, ఆలోచనలు మన కోసం, మనందరి కోసం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలన్న, మీ చిరకాల వాంఛ తీరాలన్న ప్రతి ఒక్కరు, మీ వంతుగా కృషి చేసి మీ సమీప వార్డులో, మీ గ్రామంలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో, జనసేన పార్టీని ప్రేమతో అభిమానం తో, నమ్మకంతో, ధైర్యంతో పని చేసి నియోజకవర్గంలో. జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఛం అవుతారు. మనం పార్టీ అధ్యక్షుల కోసం మన ప్రాంతంలో బలోపేతం చేస్తే, అలాగే అన్ని ప్రాంతలలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తే, పొత్తుల్లో కూడా ఎక్కువ సీట్లు తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయచ్చు. మీరు కూడా ఎం.పి.టి సి, సర్పంచ్, ఎం.పి.పి, జెడ్. పి.టి.సి, ఎం.ఎల్.ఏ, ఎం. పి, ఎం.ఎల్.సి కూడా అవ్వచ్చు. ఎవరు పై నుండి దిగి రాలేదు. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఆశక్తి ఉన్న యువత అంతా ముందుకు వచ్చి మీ గ్రామం నుండి, మీ మండలం నుండి, సమస్యల మీద పోరాడచ్చు, మీకు నేను అండగా ఉంటాను. తాగు నీరు సమస్య, వీధిలైట్ల సమస్య, డ్రైనేజీల సమస్య, రోడ్లు సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల ధన సమస్యలు, సాగు నీరు సమస్య, ఎన్నో సమస్యలు ఉన్నాయి. పోరాడదాం. మీకు అండగా నేను ఉంటాను. మన ప్రజల తరుపున, జనసేన పార్టీ తరుపున పోరాడదాం రండి.. కదలిరండి.. మన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం జనసేన పార్టీ గెలుపు కోసం, జనసేనాని ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని భాదలు ఎదురైన, ఎన్ని బెదిరింపులు వచ్చిన, నాచివరి శ్వాస వరకు జనశ్రేణులకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.. నేను గత ఎలక్షన్ల గురించి జరిగిన పొరపాట్ల గురించి పూర్తిగా అధ్యయనం చేసాను, వాటి పట్ల ఎన్ని ప్రలోభాలు చేసారో, అన్ని పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరుచుకున్నాను. దైవబలం, ప్రజాబలం, అంగబలం, అర్థబలంతో రాజానగరం నియోజక వర్గం లో జనసేన పార్టీని అత్యధిక మెజారిటీ తో గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధం అవ్వండి. నేను, నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులు, శ్రేయాభిలాషులను పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించడంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించి, అంగ బలం, అర్థబలం, దైవ బలం, ప్రజా బలం జోడించి, మరుగుతున్న నెత్తురుతో, కొండలను ఢీ కొట్టె గుండె ధైర్యంతో, అలుపు ఎరుగని పోరాటంతో, ప్రజా సంక్షేమం కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క అవకాశంతో 25 సంవత్సరాలు గుర్తుండేలా ప్రజా పరిపాలన కోసం నేను ధర్మ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యుద్ధం చేస్తాను. నాతో రండి మనందరం కలిసి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని బత్తుల పిలుపునిచ్చారు.