సిపిఐ నారాయణ వ్యాఖ్యలకు నిరసన తెలిపిన రామ్ చరణ్ యువత

కదిరి: మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి పై విమర్శలు చేసిన సిపిఐ నారాయణ వాఖ్యలకు వ్యతిరేకంగా కదిరి రామ్ చరణ్ యువత ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేంతవరకు మా అభిమానులు ప్రతి చోటా అతనికి నిరసన తెలుపు తూనే ఉంటాం అని కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో సి.ఐమధుసూదన్ గకి అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత తరపున కదిరి మెగా ఫ్యాన్స్ ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి నియోజక వర్గం మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.