బాబా సాహెబ్ అంబేద్కర్ కు రామగుండం జనసేన ఘననివాళి

రామగుండం నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గం నాయకులు. ఈ సందర్బంగా రామగుండం మండల యువజన అధ్యక్షులు ఏముర్ల రంజిత్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసి, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మండల యువజన ఉపాధ్యక్షులు బండారు తిరుపతి, గడ్డం సురేష్ గౌడ్, బాబా మియ, ఎస్.వి రామగిరి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.