రవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలతో అందరికీ స్ఫూర్తిగా నిలవాలి: గాదె

గుంటురు, డాక్టర్ బి.రవి కుమార్ స్ఫూర్తితో ఆదివారం రవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ డాక్టర్ బి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం లాలాపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం డాక్టర్ బి.చంద్రశేఖర్ కి ప్రజలకు సేవ చేయాలనే గుణాన్ని తెలియజేస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది రక్తదానం చేయటం ఎంతో స్ఫూర్తిదాయకమని, అలాగే ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలందరిలో సేవా గుణాన్ని పెంపొందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, గుంటూరు నగర నాయకులు మధులాల్, గోపిశెట్టి సాయి మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.