RBI Recruitment 2021: ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. దేశంలో బ్యాంకులకే బ్యాంకుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 23తో ఆర్‌బీఐ నాన్ సీఎస్‌జీ పోస్టుల దరఖాస్తులకు అహ్వానించింది.

నాన్ సీఎస్‌జీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, ఫిబ్రవరి 23నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

మొత్తం పోస్టులు: 29

పోస్టుల వివరాలు

అసిస్టెంట్ మేనేజర్ (Official Language) – 12 Posts

లీగల్ ఆఫీసర్ (Grade B) – 11 Posts

మేనేజర్ (టెక్నికల్ సివిల్) – 1 Post

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ &సెక్యూరిటీ) – 5 Posts

అసిస్టెంట్ మేనేజర్ (Official Language) – రూ. 63,172 వేతనం

లీగల్ ఆఫీసర్ (Grade B) – 11 Posts – రూ. 77,208 వేతనం

మేనేజర్ (టెక్నికల్ సివిల్) – 1 Post – రూ. 77,208 వేతనం

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ &సెక్యూరిటీ) – రూ. 63,172 వేతనం

అసిస్టెంట్ మేనేజర్ (Official Language): ఈ పోస్టులకు హిందీ, భాషాకు గానూ మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. రెండు భాషాల్లో మంచి పట్టు ఉండి, రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

లీగల్ ఆఫీసర్ (G(Grade B): ఈ పోస్టుకు సంబంధించి లా పట్టభద్రుడై ఉండాలి. అదనంగా రెండు సంవత్సాల అనుభవం కలిగి ఉండాలి.

మేనేజర్ (టెక్నికల్ సివిల్): ఈ పోస్టుకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. మూడు సంవత్సరాలపాటు వృత్తిలో అనుభవం కలిగి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ &సెక్యూరిటీ): ఈ ఉద్యోగానికి ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాల్లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుం…

జనరల్, ఓబీసీ, దివ్యాంగులకు – రూ. 600

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు – రూ. 100

దరఖాస్తు గడువు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంః ఫిబ్రవరి 23

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీః మార్చి 10, సాయంత్రం 6గంటలు.

అధికారిక వెబ్‌సైట్ – rbi.org.in