బాడీ బిల్డర్ కాంపిటీషన్ విజేతలకు బహుమతులు అందజేసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కీ.శే. స్వర్గీయ బడేటి కోట రామారావు (బుజ్జి) 4వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం “శ్రావణి మజిల్ పవర్ జిమ్” ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), తపన ఫౌండేషన్ అధినేత, బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బిజేపి పార్టీల నాయకులు పాల్గొన్నారు.