బోండా వారి వీధిలో పర్యటించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ఏలూరు నియోజకవర్గంలోని 12వ డివిజన్ దక్షిణపు వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఆళ్ల నాని కాలయాపన చేస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. దక్షిణపు వీధిలోని బోండా వారి వీధిలో ఆయన పర్యటించి అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు.. దక్షిణపు వీధిలో ఉన్న మార్కండేయ స్వామి వారి ఆలయం రహదారిలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైన్ పొంగి రోడ్డు మీదకు వచ్చి దుర్వాసనతో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు అనారోగ్యాలకు గురౌతున్నారని డివిజన్ లోని కార్పోరేటర్ కర్రి శ్రీనివాసరావు కు ఎన్ని సార్లు చెప్పినా ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఓట్లు వేసి తమ భుజాలపై మోసిన పాపాన డివిజన్ లోని ప్రజలకు మీరు చేసిన ఘనకార్యం ఇదా ?? అని మండి పడ్డారు. నిత్యం వందలాది మంది ఈ దారిలోనే ప్రయాణిస్తున్నారని, డ్రైన్లు పొంగి రోడ్డు మీద నీరు చేరిపోవడం తో చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళకి అసౌకర్యంగా మారిందని తెలియజేసిన స్థానిక కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఎమ్మెల్యే ఆళ్ళనాని, మేయర్ నూర్జహాన్, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఏలూరులోని అన్ని డివిజన్ లో ఇలా పర్యటిస్తానని నియోజకవర్గంలో ఉన్న ప్రతిఒక్క సమస్యపై ఇలాగే పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లుసాయిచరణ్, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కుర్మా సరళ, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, వేముల బాలు, బుధ్ధా నాగేశ్వరరావు స్థానిక నాయకులు బోండా రాము నాయుడు, కూనిశెట్టి (సోషల్ సర్వీస్) మురళి, వల్లూరి రమేష్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.