జనసేనానికే రెల్లి సమితి మద్దతు.. రాష్ట్ర రెల్లి నాయకుల తీర్మానం

గాజువాక: రాష్ట్ర జనసేన రెల్లి సమితి సమావేశం 14 వ తేదీన కోన అప్పారావు, కోన దుర్గేశ్వరరావు అధ్వర్యంలో అనకాపల్లి జిల్లా తుమ్మపాల లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో గల 13 జిల్లాల నుండి రెల్లి కుల పెద్దలు మేధావులు నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కాలని, ఒక రెల్లి కులస్తుడు కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ ప్రకటించినందున పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతా భావంతో రాష్ట్రంలో ఉన్న రెల్లి కులస్తులందరూ కూడా జనసేనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర రెల్లి నాయకులు తీర్మానించడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర రెల్లి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు తెల్పారు. నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా సదరు విషయాన్ని ఆమోదించి తీర్మానించడం కూడా జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర రెల్లి నాయకుల వివరాలు గుంటూరు నుండి సోమి ఉదయ్ కుమార్, సొమి శంకర్రావు, తెనాలి నుండి రాఘవేంద్ర విజయవాడ నుండి భూపతి రాజు, గిరి స్వామి, పార్వతీపురం నుండి హరియాల సురేష్ విశాఖపట్నం నుండి యర్రంశెట్టి సురేష్, కాకినాడ బండి ఆది సురేంద్ర, అరకు నుండి డాక్టర్ కోన నారాయణరావు, రాజమండ్రి నుండి వై వెంకటేశ్వరరావు, తుని నుండి రాజు, అనకాపల్లి నుండి కోన అప్పారావు దుర్గేష్ ఇతర జిల్లాల నుండి ప్రేమ్ కుమార్ చల్లా బుజ్జి, సోమి శ్రీను, భూపతి, నాగార్జున మరిన్ని జిల్లాల నుంచి పెద్దలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ని 2024 లో సీఎం చేయడమే రాష్ట్ర రెల్లి సమితి లక్ష్యంగా అందరూ పని చేస్తామని ఒకటే అజెండాగా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రాష్ట్రస్థాయి కమిటీ తీర్మానం ద్వారా గ్రామ గ్రామాల్లో కూడా పర్యటించి వారిలో చైతన్యం తీసుకు రావడానికి ఈ రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని తెలియజేశారు.