దామలచెరువులో ప్రతి వీధిలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి: జనసేన డిమండ్

చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు పంచాయతీ, మౌలాలిపేట వీధి. ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నారు కానీ దామలచెరువు తలరాత మారటం లేదు దామలచెరువు పంచాయతీ పాకాల మండలం లోనే 2 వ అతిపెద్ద పంచాయతీ, సంవత్సరానికి 3 నెలలు మామిడి వ్యాపారానికి పెట్టింది పేరు, మండలానికి రెవిన్యూ జనరేట్ అవుతోంది కూడా ఎక్కువగా దామలచెరువు నుండి, ఇవ్వన్నీ పేరుకే గానీ అభివృద్ధి మాత్రం శున్యము, దామలచెరువులో పూర్తిగా సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ కాలువ ఉన్న వీధి ఒక్కటి లేదు, చంద్రగిరి నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 దఫాలుగా ఇక్కడ అధికారంలో ఉన్నారు, 2019 ఎన్నికల సందర్భంగా దామలచెరువు లోని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మిస్తాం అని మాటిచ్చారు కానీ చేసింది లేదు, డ్రైనేజీ కాలువలు లేవు కానీ, డ్రైనేజీ పన్నులు మాత్రం వేస్తారు,
ఉన్న కాలువలు అన్నీ శుభ్రంగా ఉన్నాయా అంటే.. అవి లేవు. దీని వలన పసిపిల్లలు అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి
ఓట్ల సమయంలో ఉండే అక్కర, శ్రద్ధ ప్రజల పైన, ప్రజా సమస్యల పైన అధికారం వచ్చాక మీకు ఎందుకుండదు, ఇంటి నుండి వచ్చే వ్యర్థము ఇంటి వెనుక గుంతలు తీసుకుని నిల్వ చేసే పరిస్థితి. దామలచెరువు లోని ప్రతి వీధిలో రోడ్డులు నిర్మించాలి, డ్రైనేజీ కాలువలు వెయ్యాలి, ఉన్న కాలువలు క్రమం తప్పకుండ సుబ్రపరచాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాం. అతి త్వరలో దీని పైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.