సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ పొందిన రాయల్ విద్యానికేతన్ విద్యార్థులు

విజయవాడ: విద్యాధరపురం రాయల్ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు కరాటే మరియు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ పొంది అనంతరం విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారు. వీరికి క్రవ్ మగ సెల్ఫ్ డిఫెన్స్ స్టేట్ చీఫ్ గోచోరీ కరాటి ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎగ్జామినర్ ప్రముఖ న్యాయవాది ఎం. హనుమాన్, రాయల్ విద్యా నికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ టి నారాయణరావు చేతుల మీదగా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్లో చదువుతోపాటు అనేక విద్యలలో విద్యార్థులకు శిక్షణ కల్పించడం మా స్కూల్ ప్రత్యేకత, ఎంతో క్రమశిక్షణ ఆరోగ్య కరం మరియు దృఢ సంకల్పం కల్పించే కరాటే ఇలాంటి క్రీడలు రాయల్ స్కూల్ ప్రోత్సహిస్తామని తెలియజేశారు.