29వ డివిజన్ లో సంకల్ప యాత్ర

  • వైసిపి పాలనలో రక్షణ కరువైంది.
  • ఏలూరు అసెంబ్లీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి, జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు విమర్శ

ఏలూరు: రాష్ట్రంలో వైసిపి పాలనలో పేదల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ కరువైందని, ఇటువంటి రాక్షస ప్రభుత్వం అవసరమా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు.. ఏలూరు 29వ డివిజన్‌ లంకపేటలో గురువారం సాయంత్రం ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు. ఏలూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు, టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాంతో కలిసి ఇంటింటికి వెళ్ళిన బడేటి చంటి కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా పేదలకు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. తనకు ఒక అవకాశం ఇస్తే ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకో సీఎం జగన్‌ తన అరాచక పాలన ద్వారా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.. జగన్‌లా నీచ రాజకీయాలు చేయడం కూటమిలోని పార్టీలకు చేతకాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని తేలిపోవడంతో సీఎం జగన్‌, వైసిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని ఆయన హితవుపలికారు.. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిర్వహిస్తున్న సభలకు ప్రజాదరణ అపూర్వంగా ఉందని, రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.. ఈ కొద్ది రోజులు ప్రతిఒక్కరూ ఐక్యంగా పనిచేస్తే విజయంతో పాటూ భారీ మెజార్టీని సొంతం చేసుకోవచ్చునని బడేటి చంటి పేర్కొన్నారు..జనసేన ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, పాలకులు దోపిడీకి అలవాటు పడడంతో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. మే 13 వ తేదీన జరుగబోయే ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి చంటి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన డివిజన్ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ వందనాల శ్రీనివాస్, డివిజన్ ఇంచార్జ్ వేగి ప్రసాద్, జనసేన నాయకులు అల్లు సాయి చరణ్, కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, జనసేన రవి, బుధ్ధా నాగేశ్వరరావు, గొడవర్తి నవీన్, కోలా శివ, నూకల సాయి ప్రసాద్, జక్కా లక్ష్మీ రామ్మోహన్ రావు, మల్లపురెడ్డి సోంబాబు, టిడిపి డివిజన్ నాయకులు పెదపూడి రాంబాబు, జుంజు మోజేష్, కునిశెట్టి గురుమూర్తి, మరకాల మురళి, కంతేటి పరమేశ్వరరావు, కంతేటి అశోక్,చింతాడ దేవి, శ్రీరామ్ రమేష్, జనసేన డివిజన్ ఇంచార్జ్ రామిశెట్టి కళ్యాణ్, వీరమహిళలు కావూరి వాణిశ్రీ, కుర్మా సరళ, కొసనం ప్రమీల, గాయత్రి, బీజేపీ నాయకులు నాగం శివ, అనిల్ ఆచార్య మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.